అమెరికాలో ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ అరుదైన గిఫ్ట్
యూఎస్‌లో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది. RRR సినిమాకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎక్కువయ్యారు. ఎన్టీఆర్ ప్యాన్స్ ఎన్టీఆర్‌ను వినూత్న రీతిలో ఆశ్చర్యపరిచారు. ‘థ్యాంక్యూ ఎన్టీఆర్… ఎన్టీఆర్ 30 కోసం వేచి ఉండలేకపోతున్నాం’ అనే బ్యానర్‌ను ఎయిర్ జెట్ ద్వారా ఆకాశంలో విహరింపజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఉగాది మర్నాడు ఈనెల 23న పూజాకార్యక్రమంతో ప్రారంభం కాబోతోందని, చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జంటగా దివంగత అందాల నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి మొదటి సారిగా తెలుగు చిత్రసీమలో ఎంట్రీ ఇవ్వనుంది.