గౌతమ్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ఫిదా..
సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్ న్యూయార్క్‌లో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణలో భాగంగానే తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను బయటపెడుతూ ఇటీవల ఓ యాక్ట్‌లో తన తోటి విద్యార్థితో కలిసి గౌతమ్ పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. గౌతమ్ యాక్టింగ్‌కు మహేశ్ అభిమానులు ఫిదా అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. గౌతమ్ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన తండ్రి బాటలోనే నటుడిగా రాణించాలని ఆశిస్తున్నాడు. ఇందులో భాగంగానే యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. కొంతకాలం క్రితం లండన్ లో మొదటిసారి స్టేజ్ పై ప్రదర్శన చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.