ఐసీసీ వీడియో పై అభిమానుల ఆగ్రహం
తాజాగా ఐసీసీ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఐసీసీ నుండి ఎటువంటి వీడియోలు వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. కాగా ఈ వీడియో పై నెట్టింట రచ్చే జరుగుతుంది. టీమిండియాకు చెందిన పలువురు ఆటగాళ్లతో ఐసీసీ తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ , సూర్యకుమార్ యాదవ్ , చాహల్ కనిపించాడు. అయితే ఈ వీడియోలో విరాట్ కోహ్లీ కనిపించకపోవడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “కింగ్ కోహ్లీ ఎక్కడ ?ఎందుకు విరాట్‌ను చూపించలేదు? కోహ్లీ లేకుండా టీమిండియా అసంపూర్ణం” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా క్రికెట్ ప్రపంచంలో పరిచయం లేని పేరు అతనిది. అలానే టోర్నీకి ముందు జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనపరిచాడు. బ్యాటింగ్ తోనే కాకుండా బౌండరీ లైన్ వద్ద ఒంటి చెత్తో క్యాచ్ పట్టి తన సత్తా చాటాడు.

