ఆటో డ్రైవర్ కు ప్రముఖ సింగర్ భారీ రివార్డు
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రీట్ మెంట్ అనంతరం ఇంటికి చేరుకున్న సైఫ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ దాడి సమయంలో సైఫ్ ను ఓ ఆటో డ్రైవర్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నటుడికి సాయం చేసిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన సాయాన్ని ప్రముఖ పంజాబీ సింగర్ మికా సింగ్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ భజన్ సింగ్ ను అభినందించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ కు భారీ రివార్డు ప్రకటించారు. ‘‘అతడు సకాలంలో స్పందించడం అభినందనీయం. ఎవరికైనా అతడి పూర్తి వివరాలు తెలిస్తే నాకు చెప్పండి. అతడికి లక్ష రూపాయలను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా” అని సింగర్ మికా సింగ్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం సైఫ్ అలీ ఖాన్ సైతం ఆటో డ్రైవర్ ను కలిశారు. సకాలంలో తనను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు సైఫ్ దంపతులు అతడికి కొంత నగదు కూడా ఇచ్చారు.

