Home Page SliderNational

పరారీలో ప్రముఖ సినీ నటి

ప్రముఖ సినీ నటి కస్తూరి కనిపించకుండా పోయారు. తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకు రావాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగు వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆమెపై మండిపడ్డారు. అక్కడి పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ చేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు పోయెస్ గార్డెన్ లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో మొబైల్ నంబరుకు ఫోన్ చేశారు. స్విచాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను గాలించేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.