Home Page SliderNational

క్యాన్సర్ బారినపడ్డ ప్రముఖ నటి

ప్రముఖ బాలీవుడ్ నటి హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డారు. కాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. క్యాన్సర్‌తో చేసే పోరాటంలో అండగా ఉండాలని,తనకోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు. కాగా మీ అందరి సపోర్ట్‌తో తాను క్యాన్సర్‌ను జయిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే హీనా ప్రస్తుతం స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా హీనా ఖాన్ హిందీలో పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. అయితే ఆమె బిగ్‌బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. కాగా హీనా ఖాన్‌కు ఇన్‌స్టాలో 19 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.