ప్రముఖ నటుడికి అస్వస్థత
తమిళ హీరో విశాల్ అస్వస్థత గురయ్యారు. తమిళనాడు – విల్లుపురంలోని ఓ వేడుకలో వేదికపై విశాల్ స్పృహతప్పి పడిపోయారు. ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోయారు. ఈవెంట్ నిర్వాహకులు విశాల్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమిళనాడు విలు్లపురంలో ఆదివారం మిస్ కువాగం ట్రాన్స్ జెండర్ బ్యూటీ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హీరో విశాల్ హాజరయ్యారు. కొద్దిసేపటికే విశాల్ ఒక్కసారిగా స్పృహ తప్పి వేదికపై కుప్పకూలిపోయారు. దాంతో ఈవెంట్ టీం వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో విశాల్ అభిమానులతో పాటు కార్యక్రమానికి వచ్చిన వారంతా షాక్ కు గురయ్యారు.