Home Page SliderNational

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కు చంద్రమోహన్ దగ్గరి బంధువు.