వైసీపీ ఎంపీ కుటుంబసభ్యులు కిడ్నాప్ – కథ సుఖాంతం
వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు చందును కిడ్నాప్ చేశారు. వారి ఇల్లు ఉండే ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలిసింది. వారు డబ్బు డిమాండ్ చేయగా, ఆ డబ్బును చెల్లించిన వారి కుటుంబానికి ఆడిటర్ అయిన వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావును (జీవీ)ని కూడా డబ్బు తీసుకుని అదుపులోకి తీసుకున్నారు కిడ్నాపర్స్. మరింతగా 50 కోట్ల రూపాయలు డబ్బును డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల విషయంలోనే ఈ కిడ్నాప్ జరిగిందని అనుమానిస్తున్నారు. 17 టీమ్‌లుగా ఏర్పాడిన పోలీసులు ఈ కిడ్నాప్ ఉదంతాన్ని చేధించారు.

హేమంత్ కుమార్ అనే రౌడీ షీటర్ డబ్బు కోసం ఈ కిడ్నాప్ చేశాడని పోలీసులు వివరించారు. గతంలో కూడా ఈయనపై మూడు కిడ్నాప్ కేసులున్నాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొన్నారు. ముగ్గురు కిడ్నాపర్లను అరెస్టు చేసి, కస్టడీలో తీసుకున్నారు. ఈ కిడ్నాప్ సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాదులో ఉన్నారని సమాచారం.