విశాఖ తూర్పులో నకిలీ ఓట్ల కలకలం
విశాఖలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. ఈ సందర్భంలో విశాఖలో దొంగఓట్ల కలకలం రేపాయి. విశాఖలోని నాలుగు నియోజక వర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. 2009 నుండి వరుసగా మూడుసార్లు తెలుగుదేశానికి చెందిన వెలగపూడి రామకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. నకిలీ ఓట్లతోనే గత ఎన్నికలలో వెలగపూడి గెలిచారని వైసీపీ ఇంచార్జ్ విజయనిర్మల ఆరోపిస్తున్నారు. దీనితో ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత ఏడాదిన్నర కాలంలో 40 వేల దొంగఓట్లను తొలగించారు. తొలగించిన ఓట్లన్నీ టీడీపీ మద్దతుదారులవేనని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి దొంగఓట్లన్నీ వైసీపీ వారివే అని పేర్కొన్నారు. దీనితో విచారణ చేపట్టిన ఎన్నికల కమీషన్ ముగ్గురు బూత్ లెవెల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. కావాలనే టీడీపీకి సంబంధించిన వారి ఓట్లను వైసీపీ తొలగించిందని టీడీపీ ఆరోపిస్తోంది.