Andhra PradeshHome Page Slider

పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ ఉన్నట్లు బయటకు రావడం సంచలనంగా మారింది. భద్రతా సిబ్బందితో ఆ నకిలీ ఫొటోలకు ఫోజులిచ్చినా గుర్తించకపోవడంతో పోలీస్ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మన్యం జిల్లా పాచిపెంట మండలం పర్యటనకు పవన్ వెళ్లిన సమయంలో ఈ నకిలీ ఐపీఎస్ పవన్ వెంటే ఉన్నారు. కింది స్థాయి సిబ్బందితో ఫొటోలు కూడా దిగాడు. పర్యటన తర్వాత ఫొటోలు బయటకు రావడంతో మన్యం జిల్లా పోలీసులు ఆరా తీశారు. నకిలీ ఐపీఎస్ అని తేలడంతో నిన్న రాత్రి అతన్ని విజయనగరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాశ్ గా గుర్తించారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు.