సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత..ఇంటర్నెట్ బంద్
సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ దేవస్థానంలో విగ్రహం ధ్వంసంపై హిందూ సంఘాలు చేపట్టిన ర్యాలీ భారీ ఉద్రిక్తతకు దారితీసింది. వీరు మసీదు వీధిలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆవేశపరులపై లాఠీఛార్జ్ చేశారు. మతఘర్షణలు జరగకుండా ముందుజాగ్రత్తలలో భాగంగా సికింద్రాబాద్‌లో ఇంటర్నెట్ బంద్ చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై కొందరు చెప్పులు, కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. దీనితో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అల్లర్లు చేస్తూ దొరికినవారందరినీ చితకబాదారు. దీనితో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

