ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆటోడ్రైవర్ హత్యకు గురయ్యాడు. సుబేదారి పీఎస్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. మడికొండకు చెందిన ఆటో డ్రైవర్లు రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు కత్తులతో దాడి చేసుకున్నారు. బొల్లికొండ లావణ్య అనే మహిళ తో రాజ్ కుమార్,వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రాజ్ కుమార్ ను హత్య చేశాడు వెంకటేశ్వర్లు. ఇందులో తీవ్రంగా గాయపడ్డ రాజ్ కుమార్ స్పాట్ లోనే చనిపోయాడు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం కు తరలించారు. నిందితుడు,మృతుడు ఇద్దరూ ఆటో డ్రైవర్లు కావడం గమనార్హం.

