ప్రజల నుంచి డబ్బులను పిండుకోవడం మంచిది కాదు..
పెద్ద సినిమాలకు టాకీసుల సంఖ్య పెంచుకోవాలి అంతేగానీ ప్రజల నుంచి డబ్బులను పిండుకోకూడదని.. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలిపింది. సినిమా టికెట్ రేట్లు తగ్గితేనే మంచిదని, ధరలు ఎక్కువుంటే ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని ఎగ్జిబిటర్లు వాపోయారు. టికెట్ ధరల, బెనిఫిట్ షోల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది. జూబ్లీహిల్స్ లోని తెలుగు ఫిలిం చాంబర్ లో ఎగ్జిబిటర్లు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రేక్షకులు ఇబ్బందిపడుతున్నారు. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మా కృతజ్ఞతలు. థియేటర్లలో ఏ సినిమా అయినా నిర్ణీత మొత్తంలోనే టికెట్ ధరలు ఉండాలి. రేట్లు ఎక్కువ ఉంటే ఒక వారానికే సినిమా పరిమితం కావాలి. ఏపీలోనూ ఇదే నిర్ణయాన్ని తీసుకోవాలని ఎగ్జిబిటర్లు సూచించారు.