పట్నం రిమాండ్ పొడిగింపు
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జ్యుడీషి యల్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజుకి ఆయన రిమాండ్ గడువు ముగియడంతో కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరు పర్చారు. విచారించిన కోర్టు వచ్చే నెల 11వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు.

