Home Page SliderTelangana

త్వరలోనే మూసీనదిపై ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తాం: KTR

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ దేశంలో ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ హైదరాబాద్‌  మహనగరంలో ఇప్పటికే ఎన్నో లక్షలమంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటు చూసిన ట్రాఫిక్ జామ్ ఉంటూనే ఉంటుంది. అయితే ఈ ట్రాఫిక్ జామ్‌ను తగ్గించేందుకు తెలంగాణా సర్కార్ అనేక ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరిస్తూ వస్తోంది. వీటిలో భాగంగానే ఇప్పటివరకు మెట్రో,ఫ్లై ఓవర్స్,స్కైవాక్ వంటి వినూత్న మార్గాలను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు మూసీనదిపై కూడా ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించనున్నట్లు తెలుస్తుంది. కాగా తెలంగాణా ఐటీ శాఖమంత్రి కేటీఆర్ రూ.10వేల కోట్లతో త్వరలోనే మూసీనదిపై ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని తెలిపారు. నార్సింగి నుంచి నాగోల్ వరకు మూసీపై 55 కి.మీ. మేర ఎక్స్‌ప్రెస్ వే కడతామని కేటీఆర్ చెప్పారు. అయితే దీనికి రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతాయని ఆయన వెల్లడించారు. కాగా ఇది పూర్తయితే మూసీనదిపై ట్రాఫిక్ జామ్ పూర్తిగా తగ్గుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే మూసీనదిపై 14 బ్రిడ్జిలు కూడా నిర్మించి..మూసీ సుందరీకరణ కూడా చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.