పాకిస్తాన్‌లో ఘోరం..టూరిస్టు సజీవదహనం
పాకిస్తాన్‌లో దుండగులు ఓ టూరిస్టును సజీవదహనం చేశారు. ఖురాన్‌ను అవమానించాడనే నెపంతో పర్యాటకుడిపై దారుణానికి పాల్పడ్డారు. సియాల్ కోట్‌కు చెందిన అతడిని ఈ విషయంపై పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్‌లో ఉన్న అతడిని స్టేషన్‌పై దాడి చేసి ఎత్తుకెళ్లారు. అనంతరం సజీవ దహనం చేశారు. గతంలో ఇదే విషయంపై మతోన్మాదులు క్రైస్తవులపై కూడా దాడులు చేసినట్లు సమాచారం.