Andhra PradeshNews

షుగర్‌ ఫ్యాక్టరీలో పేలుడు… ముగ్గురు మృతి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. జిల్లాలోని వాకలపూడి షుగర్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కన్వేయర్‌ బెల్ట్‌ పేలి పేలుడు సంభవించినట్లుగా సమాచారం. ఈ ఘటనసై సమాచారం అందుకున్న మాజీ మంత్రి కన్న బాబు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు పరామర్శి.. ప్రభుత్వం నుంచి సహాయ సహాకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు.