Andhra PradeshHome Page Slider

పేలిన క్రాకర్స్.. నలుగురికి గాయాలు..

కాకినాడలోని బాలాజీ ఎక్స్ పోర్ట్స్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. క్రాకర్స్ లోడును హమాలీలు దింపుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి క్రాకర్స్ పార్సిల్స్ కాకినాడ వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.