Home Page SliderNational

ఎగ్జిట్ పోల్స్ వల్లే మాపై నిందలు..ఈసీ

ఎగ్జిట్ పోల్స్‌కు ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.   ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండే ఈవీఎంలను పరీక్షిస్తున్నామన్నారు. మూడు రోజుల ముందుగానే, మిషన్‌లో సింబల్స్, పేర్లు పొందుపరుస్తామన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ వల్ల ప్రజలు, పార్టీలు గందరగోళానికి గురవుతున్నారని ఆరోపించారు. ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని పేర్కొన్నారు. వీటికి ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు. వీటి ఆధారంగా తమపై నిందలు అన్యాయం అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం అన్నారు.