ఉత్కంఠగా రామ్ సేతు ట్రైలర్
అభిషేక్ శర్మ దర్మకత్వంలో అక్షయ్ కుమార్ , సత్యదేవ్ కలిసి నటించిన సినిమా ‘రామ్ సేతు’. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మూవీలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీనిలో కథానాయుకలుగా జాక్వాలిన్ ఫెర్నాండేజ్, నుస్రత్ బరూచా నటించారు. ఈ దేశం శ్రీ రాముడి పై నమ్మకంతో నడుస్తోంది అంటూ నటుడు నాజర్ పరిచయ సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభ సన్నివేశం మొదలవుతుంది. రామ సేతు వారధి రహస్యాల నేపథ్యంపై దీని కథ సాగుతుండగా…ఇతిహాసాల్లోని నిజాన్ని వెలికితీసే వ్యక్తిగా అక్షయ్ కనిపించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 7000 ఏళ్ల క్రితం జరిగిన సంగతులను తెలుసుకునే క్రమంలో అక్షయ్ , సత్యదేవ్ చేసిన సాహసాలు , కామెడీ సంఘటనలు , ఫైట్ సీన్లు చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్నాయి. కాగా ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 25ల ప్రేక్షకులను అలరించనుంది.