Home Page SliderInternational

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు బెయిల్ మంజూరు

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. సీఫర్ కేసుకు సంబంధించి పాక్ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్‌పై దాదాపు 150 కేసులు ఉన్నాయి. ఈ కేసులో బెయిల్ లభించినా మిగతా కేసుల్లో వారెంట్ ఉన్నందున ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొంది. కాగా దేశ రహస్యాలను లీక్ చేశారన్న కారణంగా ఇమ్రాన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొద్ది నెలలుగా ఆయన జైలులోనే ఉంటున్నారు.