Home Page SliderInternationalSports

టీమిండియాపై పాక్ మాజీ స్పిన్నర్ సంచలన కామెంట్స్

టీమిండియాపై పాక్ మాజీ స్పిన్నర్ కనేరియా  సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో చాలా లోపాలున్నాయని కనేరియా గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం గోల్డెన్ డక్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేడన్నారు. అంతేకాకుండా ఆటలో శ్రేయస్ ఫిట్‌నెస్ కూడా ఆందోళన కలిగిస్తోందనన్నారు. టీమిండియా అభిమానులంతా సంజు శాంసన్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఎందుకు అతన్ని తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బౌలర్లు తేలిపోతున్నారని..వీరితో వరల్డ్‌కప్ గెలవడం టీమిండియాకు కష్టమేనని కనేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారత్  ఈసారి వరల్డ్‌కప్‌కు సిద్ధంగా లేదని స్పష్టంగా కన్పిస్తోందన్నారు.  టీమిండియాలో అర్ష్‌దీప్,ఉమ్రాన్,నటరాజన్‌లకు అవకాశాలు ఇవ్వాలని కనేరియా సూచించాడు.