విద్యార్ధిని లీలావతికి మాజీ మంత్రుల పరామర్శ
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని మాజీ మంత్రి ,సిట్టింగ్ ఎమ్మెల్యే హారీష్ రావు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చెల్లని రూపాయికి గీతలెక్కువ,రేవంత్ రెడ్డికి మాటలెక్కువ అని ఎద్దేవా చేశారు.మాట్లాడితే మూసి,హైడ్రా అని కూల్చివేతల గురించే మాట్లాడుతాడు తప్ప…భావిభారత పౌరులైన విద్యార్ధుల సంక్షేమం ఎలా అనే ఆలోచనే ముఖ్యమంత్రికి లేదని విరుచుకుపడ్డారు.కేసిఆర్ హయాంలో సంక్షేమంగా ఉన్న హాస్టల్స్ అన్నీ ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ధ్వజమెత్తారు.గురుకులాల్లో యుద్దప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. హరీష్ వెంట ఎల్వోపీ మధుసూదనా చారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ఉ న్నారు.