Home Page SliderTelangana

మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి సతీ వియోగం

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్రీమతి శ్వేత కన్నుమూశారు. చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న ఆమె గత రాత్రి 10 గంటల 15 నిముషములకు స్వర్గస్తులయ్యారు. కొంత కాలంగా ఆమె చెన్నైలో చికిత్స పొందుతున్నారు. భార్య అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో లక్ష్మారెడ్డి, చెన్నైలోనే ఉంటూ ఆమె చికిత్సను పర్యవేక్షిస్తూవచ్చారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య సమస్యలతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో ఆమె అత్యక్రియలు నిర్వహించనున్నారు.