ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు..
యూఎస్ లోని అన్ని రాష్ట్రాల్లో పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని టెస్లా చీఫ్, బిలియనీర్ ఎలాన్ మస్క్ కోరారు. ఈవీఎంలతో రింగ్ చేయొచ్చన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరపున నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ… ‘నేనొక టెక్నాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రాంల గురించి బాగా తెలుసు. నిత్యం వాటిపైనే అధ్య యనం చేస్త. ఓటింగ్ మెషీన్లను ఈజీగా హ్యాక్ చేయొచ్చు. వీటి గురించి నాకు ఎవరో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు’ అని పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే భారత్లో ఈవీఎంలను ట్యాం పరింగ్ చేస్తున్నారని పలు పార్టీల నేతలు ప్రత్యక్షంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో మస్క్ వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి.