Home Page SliderNewsTelangana

బోనాల ఉత్సవాలకు అంతా సిద్ధం… ఈసారి ఏకంగా రూ .20 కోట్లు

హైదరాబాద్‌లో జరుగనున్న ప్రసిద్ధ బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈసారి రూ. 20 కోట్లు కేటాయించింది. మంగళవారం మంత్రి కొండా సురేఖ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం ఉత్సవాల్లో తలెత్తిన కొన్ని ఇబ్బందులు ఈసారి రాకుండా అభివృద్ధి చేసిన యాక్షన్ ప్లాన్ ఆధారంగా ఏర్పాట్లు చేపడతామన్నారు.జోగినీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, వీఐపీ మూమెంట్‌లలో తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో పొన్నం ప్రభాకర్ వీడియో వైరల్‌ అయిన నేపథ్యంలో, డ్యూటీ సజావుగా జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గోల్కొండ, బల్కంపేట, లాల్ దర్వాజ వంటి ప్రాంతాల్లో జరిగే ముఖ్య బోనాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నో శాఖలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రులు సూచించారు. కొత్తగా కలిసిన దేవాలయాల వల్ల ఇంకా 10% అదనపు నిధులు విడుదల చేయాలన్న అభిప్రాయాన్ని మంత్రి సురేఖ వ్యక్తం చేశారు.