‘రేవంత్ ప్రభుత్వంలో అన్నీ గోవిందే’..బీఆర్‌ఎస్ వినూత్న నిరసన
తెలంగాణ భవన్ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలనలో అన్ని స్కీములూ గోవిందే అంటూ కౌంటర్ వేస్తున్నారు…
రైతు బంధు గోవిందా..
రైతు భరోసా గోవిందా..
కళ్యాణ లక్ష్మి గోవిందా..
షాదీ ముబారక్ గోవిందా..
బీసీ బంధు గోవిందా..
కాంగ్రెస్ వచ్చి గోవిందా..
రేవంత్ వచ్చి గోవిందా..
అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాగ్దానాలతోనే కాలక్షేపం చేస్తోందని, హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ వీడియోలు వార్తల్లో వైరల్ అవుతున్నాయి.

