Home Page SliderTelangana

అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విధిగా ఓటుహక్కు వినియోగించుకోవాలి.

స్వేచ్ఛ, సుపరిపాలన కోసం అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా ఓట్లు వేస్తున్నారు. అందుకోసం నేను వినమ్రంగా వేడుకుంటున్నా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అర్ధరాత్రి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు. హుజూరాబాద్‌లో చిల్లర ప్రచారం చేస్తున్నారు.

గజ్వేల్‌లో తుదకంటా పోరాటం చేస్తుంటే.. చేతులెత్తేసినా అని విష ప్రచారం చేస్తున్నారు. మీరు ఏం చేసినా ఈటల రాజేందర్‌ను గజ్వేల్ ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారని చెప్తున్నారు. ఎన్నిసార్లు ఓటు వేస్తారు అని చిల్లర ప్రచారం చేస్తున్నారట.. ఎన్నిసార్లు వేసినా గౌరవం పెంచిన. మా ఎమ్మెల్యే అని చెప్పుకొనేలా చేశా. హుజూరాబాద్‌లో రెండు పార్టీలకు భవిష్యత్తు లేదు. గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న కుట్రలు, దౌర్జన్యాలకు  ప్రతిఫలం ప్రజలు ఇస్తున్నారు. అధికారం, అహంకారంను ఎదిరించే ఆయుధం ఓటుతో బుద్దిచెప్తున్నారు.  దమననీతి,  దౌర్జన్యంకు చెంప చెళ్లుమనిపిస్తున్నారు. స్వేచ్ఛగా ఓటు వేయండి. గజ్వేల్‌లో ఏ ఇంటికి ఆ ఇల్లు, ఎవరికి వారు కథానాయికులై  ఈటలను గెలిపించుకోవాలని అనుకుంటున్నారు.