Andhra PradeshHome Page Slider

ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కనాలి: సీఎం

ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కంటేనే జనాభా సమతుల్యత ఉంటుందని CM చంద్రబాబు అన్నారు. ‘కొన్ని దేశాలు జనాభా తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చదువుకున్న యువత పిల్లల్ని కనడంపై ఆసక్తి కనబర్చడం లేదని సీఎం పేర్కొన్నారు. ఏపీని గాడిలో పెడతానని నన్ను గెలిపించారన్నారు. మన గవర్నమెంట్ కొనసాగి ఉంటే ఎంత అభివృద్ధి చెందేదో ఆలోచించండి? ఇంకో వ్యక్తి వచ్చి ఏదో చేస్తానంటే ప్రజలు మోసపోతున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయంలో పద్దతి లేని పరిపాలన చేశారని విమర్శించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా శిక్షిస్తామని..తప్పు చేసిన ఎవరినీ వదిలి పెట్టనని చంద్రబాబు హెచ్చరించారు.