బ్రహ్మాస్త్ర పార్ట్ -2 పార్ట్- 3 ఎప్పుడో తెలుసా?
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్ర తదుపరి చిత్రాల అప్‌డేట్ వచ్చేసింది. నార్త్, సౌత్ ఇండియా స్టార్స్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర-1 శివ మూవీని గత ఏడాది చూసాం. రణబీర్ కపూర్,అలియాభట్, అమితాబ్, నాగార్జున నటించిన ఈ చిత్రం అందరినీ అలరించింది. ఈ సినిమాకు సంబంధించి పార్ట్-2 దైవా, పార్ట్-3 లను ఒకేసారి చిత్రీకరించబోతున్నామని, పార్ట్ 2 ను 2026లోనూ, పార్ట్ 3 ని 2027డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాలపై బాగా దృష్టి పెట్టి చేయాలని, కథను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. తారాగణం మార్పుల విషయంలోఎలాంటి ప్రకటనలు చేయలేదు. మొదటి భాగం దాదాపు 430 కోట్ల రూపాయలు వసూలు చేసింది. డిస్నీ హాట్ స్టార్‌లో అన్ని భాషలలో స్ట్రీమింగ్ జరుగుతోంది.