నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చే అవకాశముంది. వరుసగా పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై ఆయన పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీచేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.