బీఆర్ఎస్ ను చూసైనా బుద్ధి తెచ్చుకోండి
సీఎం రేవంత్ రెడ్డి దబాయింపులతో, బెదిరింపులతో రాష్ట్రాన్ని నడపలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో చూసైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ డొల్లతనం ఇప్పటికే తేటతెల్లమైందని, మంత్రులు కోప్పడకుండా ప్రజలకు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలని రాజేందర్ సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో రేవంత్ కొత్తగా చేసేదేమీ లేదని, కొత్తవాటి ఏర్పాటు ఎలా ఉన్నా స్కూళ్లను మూసివేయకుండా చూడాలని పేర్కొన్నారు. అయినా విద్యార్థుల తిండికే డబ్బులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం వారికి బిల్డింగులు ఏం కడుతుందని ఎద్దేవా చేశారు.

