Home Page SliderTelangana

ట్రాఫిక్ ఆగిపోతున్నా ఒక్క పోలీసు రోడ్డుపై డ్యూటీ చేయడు?

ఖైరతాబాద్: మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఎన్ని ఆకాశమార్గాలను నిర్మించినా ఫలితం ఉండటం లేదు. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి గంటలకొద్దీ ట్రాఫిక్ ఆగిపోతున్నా ఒక్క ట్రాఫిక్ పోలీసు రోడ్లపై కనిపించడం లేదు. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనాలు రెండు కిలోమీటర్లు వెళ్లేందుకు కనీసం గంటన్నర టైమ్ పట్టిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌లో వెడుతున్నప్పుడు ట్రాఫిక్‌ జామ్‌లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో సీఎం ప్రజలను ఆపొద్దని పెద్ద మనస్సుతో చెబుతున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు తగిన నిర్ణయాలు తీసుకొని ట్రాఫిక్ జామ్‌లు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మనవి.