Home Page SliderNational

‘తమన్నాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నా’-విజయ్ వర్మ

తమన్నాతో తాను పీకల్లోతు ప్రేమలో పూర్తిగా మునిగిపోయానంటున్నారు విజయ్ వర్మ. తమన్నాను ప్రేమిస్తున్నానని, ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేనని వివరిస్తున్నారు. తాము డేటింగ్ చేస్తున్నట్లు పూర్తిగా అర్థమయ్యిందన్నారు. తన జీవితంలో విలన్ దశ పూర్తయ్యిందని, ఇక రొమాంటిక్ దశ మొదలయ్యిందన్నారు. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి అని కితాబు ఇస్తున్నారు. తమది ప్రచారం కోసం నటించే ప్రేమ కాదని, ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నామని తెలియజేశారు. వారిద్దరూ కలిసి ఇటీవల ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. దీనిలో వీరిద్దరి కెమిస్ట్రీకి బాగా మార్కులు పడ్డాయి. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యింది. గతంలో తమన్నా కూడా విజయ్ వర్మను ప్రేమిస్తున్నానంటూ ప్రకటించారు. విజయ్ రాకతో తన జీవితం పరిపూర్ణమయ్యిందని, తననెంతో గౌరవిస్తాడని, తన అభిప్రాయాలకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నాడని పేర్కొన్నారు.