కేసీఆర్‌పోయి రేవంత్ వచ్చినా మార్పులేదు, కాళేశ్వరం విషయంలో రెండు పార్టీలు కుమ్మక్కు-మోదీ
కేసీఆర్ పోయి రేవంత్ వచ్చినా పాలనలో మార్పు రాలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదన్నారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటామన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం కుంగిందన్న మోదీ… ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల విషయంలో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కవుతుందన్నారు. దేశాభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దన్నారు. ఆదివాశీ మహిళను రాష్ట్రకపతి చేసిన ఘనత బీజేపీదేనన్నారు. తెలంగాణ పవిత్ర భూమి అన్న మోదీ… రామమందిర ద్వారాలు తెలంగాణలోనే తయారయ్యాయన్నారు. తెలంగాణకు రాముడి ఆశీర్వాదం ఉంటున్నారు.

2014 తర్వాత తెలంగాణ వికాసం కోసం ఎంతో చేశానన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క యూనివర్శిటీని ప్రారంభిస్తున్నామన్నారు. పసుపు బోర్డు, టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభిస్తున్నామన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమన్న మోదీ… ఇల్లు వదిలేసి లక్ష్యం కోస నపనిచేస్తున్నానన్నారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేశానన్న ప్రధాని దేశ ప్రజల కలలు నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు. బిడ్డల విష్యత్ కోసం పరితపిస్తున్నానన్నారు. మేరా భారత్, మేరా పరివార్.. ఇదే తన భావన అన్నారు మోదీ. దేశమంతా మోదీ కుటుంబమంటోందన్నారు. 140 కోట్ల ప్రజలే తన కుటుంబమన్న మోదీ… వారి కలల సాకారం కోసమే పనిచేస్తామన్నారు.