28 వేల సార్లు నా పేరు చెప్పినా అబద్ధం నిజం కాదు.. కవిత ట్వీట్
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ట్విట్టర్ ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు!! 28వేల సార్లు నా పేరు చెప్పినా అబద్ధం నిజం కాదు” అంటూ రిప్లై ఇచ్చారు. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సమీర్ మహేంద్రునితోపాటు మరో నాలుగు మద్యం సంస్థలపై ఈడీ ప్రత్యేకకోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఛార్జీషీటులో ఈడీ పేర్కొంది. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్ చేశారు.

