‘ఆ పార్టీ వల్ల అవకాశాలు పోయాయి’..సింగర్
ప్రముఖ నేపథ్య గాయని మంగ్లీ వైసీపీ పార్టీకి పాడడం వల్ల కొన్ని అవకాశాలు పోయాయని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ వివరణ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు కోరడం వల్లే పాట పాడానని బహిరంగ లేఖ రాసింది. ఇటీవల ఆమె కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి అరసవల్లి దేవాలయానికి వెళ్లారు. దీనితో అందరూ విమర్శించారు. గతంలో వైసీపీ పార్టీకి పాట పాడిన మంగ్లీ ఇప్పుడు టీడీపీ నేతతో కలిసి రావడం వల్ల సామాజిక మాధ్యమాలలో అసంతృప్తి మొదలయ్యింది. దీనితో ఆమెపై విమర్శలు కురిపించారు. వీటికి వివరణ ఇస్తూ ఆమె లేఖ రాశారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ పార్టీ నాయకులు అడిగితే పాట పాడానని, ఇతర పార్టీలను ఒక్క మాట కూడా అనలేదని క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ కార్యకర్తను కాను, నాకు పార్టీల రంగు పూయవద్దని విజ్ఞప్తి చేశారు.