NewsTelangana

చేనేత కార్మికులూ.. జీఎస్టీ విధించినా వాళ్లకు ఓటేస్తారా..?

చేనేత రంగంపై సీఎం కేసీఆర్‌ 5 శాతం జీఎస్టీ విధించినా వాళ్లకు ఓటేస్తారా.. అని చేనేత కార్మికులను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు సభలో ఆయన ఆదివారం మాట్లాడారు. ‘చేనేత కార్మికులకు నేను ఒకటే మాట చెబుతున్నా.. దేశంలో ఎవరూ చేయని దుర్మార్గం వాళ్లకు చేశారు. చేనేతకు 5 శాతం జీఎస్టీ వేసినా వాళ్లకు ఓటేయాలా.. నేను కాటు వేస్తా.. మీ అన్నం లాక్కుంటా.. అని చెప్పినా వాళ్లకే ఓటేయాలా.. వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. నీ వేలితోనే నీ కంట్లో పొడుస్తా.. అని చెప్పినా వాళ్లకే ఓటేయాలా.. చేనేతకు జీఎస్టీ తొలగించాలంటూ పోస్టు కార్డు ఉద్యమంతో పాటు ఓటు రూపంలోనూ నిరసన తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని కేసీఆర్‌ కోరారు.