Home Page SliderTelangana

తెదేపాతో పొత్తుపై చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు

అమరావతి: జనసేన తెదేపా పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు, వెంటనే పార్టీ చర్యలు తీసుకుంటుంది. అలాంటివారిని వైకాపా కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే వైకాపాలోకి వెళ్లిపోవచ్చు అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కరాఖండీగా చెప్పారు. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో, పవన్ కళ్యాణ్‌కో తూట్లు పొడిచినట్లు కాదు. ఏ ప్రజలకోసం నిలబడాలనుకుంటున్నామో దానికి తూట్లు పొడుస్తున్నట్లు. అందుకే అలాంటి చర్యలను సహించను అని తేల్చి చెప్పారు. తెదేపా, జనసేన పొత్తు, భవిష్యత్తు కార్యాచరణ, సంయుక్త పోరాటం తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు.