వంద పాకిస్తాన్ లు వచ్చినా ఏం పీకలేరు..
ఒకటి కాదు.. వంద పాకిస్తాన్ లు వచ్చినా ఏం పీకలేరని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతి ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ కు సరైన సమాధానం చెప్పే అసలైన నమో మోదీ అనే మిసైల్ ఉందన్నారు. సింహం ముందు ఆటలు ఆడకూడదన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మ తిరగడం ఖాయం. భారత్ గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరని లోకేశ్ వ్యాఖ్యానించారు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు.

