జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువే:చంద్రబాబు
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. కాగా రాష్ట్రంలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల పోరు రణరంగాన్ని తలపిస్తుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార పార్టీ లోపాలను ప్రతిపక్ష పార్టీలు ఎత్తి చూపిస్తూ..విమర్శలకు దిగుతున్నాయి. అయితే ఈ విమర్శలను అధికారపక్ష నాయకులతోపాటు సీఎం జగన్ కూడా బాగానే తిప్పి కొడుతున్నారు. అయినప్పటికీ ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అంటూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో YCP ఓడితేనే రాష్ట్రం గెలిచినట్లని ఆయన వెల్లడించారు. పార్టీలో పరిస్థితిని గమనించే కొందరు YCP నేతలు TDPలో చేరుతున్నట్లు చెప్పారు. జగన్ ముందు రాక్షసుడైన బకాసురుడు కూడా తక్కువే అన్నారు. సీఎం జగన్ చరిత్రలో ఉన్న రాక్షసులందరినీ మించిన రాక్షసుడని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ప్రశాంతంగా విశాఖలో ఇప్పుడు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొందని చంద్రబాబు మండిపడ్డారు. అయితే దీనికి కారణం జగన్ అని చంద్రబాబు ఆరోపించారు.