’60 దాటినా డ్యాన్స్ చేస్తూనే ఉంటా’…తమన్నా
మిల్కీబ్యూటీ తమన్నా సీనియర్ హీరోల సినిమాలతో సందడి చేయనుంది. రజనీకాంత్‌తో జైలర్, చిరంజీవిలతో భోళాశంకర్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కొందరు అభిమానులు ఒక ఇంటర్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను 60 ఏళ్లు దాటినా డ్యాన్స్ చేస్తూనే ఉంటానని బదులిచ్చింది తమన్నా. తన ఇద్దరు హీరోలకు, తనకు మధ్యగల వయస్సు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని విమర్శించేవారికి ఇలా జవాబిచ్చింది తమన్నా. సినిమాలో వయస్సు వ్యత్యాసం ఎందుకు చూస్తారని, పాత్రలను మాత్రమే చూడాలని, తాను కూడా 60 ఏళ్లు వయసు వచ్చినా టామ్ క్రూజ్‌లా విన్యాసాలు చేస్తూ, సాసీ డ్యాన్స్ చేస్తానని పేర్కొంది. వారు అనుభవం గల గొప్ప నటులని, వారితో పని చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ ఫొటోను చూపిస్తే, విజయ్ తనకు రియల్ హీరో అంటూ బదులిచ్చింది. కాగా తమన్నా నటిస్తున్న భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.

