అలాంటి చెట్లపై పిట్ట కూడా కూసోదు..
కోనో కార్పస్ చెట్టు మీద పిట్ట కూడా కూసోదని.. వెంటనే వాటిని తీసివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ హయాంలో 10 ఏండ్లలో హరితహారం పేరుతో 200 కోట్ల మొక్కలు నాటినం అన్నారు. అందులో ఎక్కువగా కోనో కార్పస్ మొక్కలే పెట్టారు. వీటికి నీళ్లు అవసరం లేదు. ఆక్సిజన్ తీసుకుంటుంది.. కార్బన్ డయాక్సైడ్ వదులుతుంది. అలాంటి చెట్లను తీసేయండి’ అని అన్నారు.

