Home Page SliderInternational

“లెబనాన్‌లో ఇళ్లు ఖాళీ చేయండి”..ఇజ్రాయెల్ హెచ్చరికలు

లెబనాన్‌లో ఇళ్లు ఖాళీ చేయాలంటూ పౌరులను హెచ్చరించింది ఇజ్రాయెల్. హెజ్‌బొల్లాతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇప్పటికే లెబనాన్‌లోకి ప్రవేశించాయి ఇజ్రాయెల్ సేనలు. దీనితో లెబనాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్. ఐక్యరాజ్య సమితి బఫర్ జోన్‌కు ఉత్తరాన ఉన్న లెబనాన్ గ్రామాలను ఖాళీ చేయాలని స్థానికులను కోరింది. తమ దేశానికి ప్రమాదం అని భావించిన ప్రతీ దేశంపైనా విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఇప్పటికే గాజా, లెబనాన్, సిరియాలోని శత్రుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది. గురువారం సిరియా పశ్చిమతీరంలోని ఆయుధ డిపోపై బాంబుల వర్షం కురిపించిందని సమాచారం. హెజ్‌బొల్లా గ్రూప్‌కు ఆయుధాలు అందకుండా చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యంగా పనిచేస్తోంది.