Home Page SliderInternational

ఇరాన్ యువతి అమినికి EU ‘సఖరోవ్ ప్రైజ్’ మనీ

హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్టై.. పోలీస్ కస్టడీలో ప్రాణాలు వదిలిన 22 ఏళ్ల కుర్దిష్ – ఇరానియన్ మహిళ మాసా అమినికి మరణానంతరం అరుదైన గౌరవం దక్కింది.

స్ట్రాస్‌బర్గ్: హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్టై.. పోలీస్ కస్టడీలో ప్రాణాలు వదిలిన 22 ఏళ్ల కుర్దిష్ ఇరానియన్ మహిళ మాసా అమినికి మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ఐరోపా సమాఖ్య (ఈయూ) ప్రతిష్ఠాత్మక మానవ హక్కుల పురస్కారమైన సఖరోవ్ ప్రైజ్‌కు అమినిని ఎంపిక చేశారు. ఈ మేరకు యూరోపియన్ పార్లమెంట్ గురువారం ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన కుర్దిష్ మహిళ మాసా అమినిని.. గతేడాది సెప్టెంబర్‌లో హిజాబ్ సరిగా ధరించలేదన్న అభియోగాలపై నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ 2022 సెప్టెంబర్ 16న ప్రాణాలు విడిచింది. ఆమె మృతితో ఇరాన్‌లో పెద్దయెత్తున నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐరోపా సమాఖ్య.. అత్యున్నత మానవ హక్కుల పురస్కారానికి మాసా అమినిని (మరణానంతరం) ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సఖరోవ్ బహుమతి కింద 50 వేల యూరోలు (దాదాపు రూ.43.89 లక్షలు) అందిస్తారు.