Home Page SliderTelangana

ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే, ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్టు చేశారు. బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఎల్బీనగర్‌లో బీజేపీ కార్పోరేటర్ల ఇళ్ల ముందు వాహనాలను మొహరించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను అరెస్టు చేశారు. నిజంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు చిత్తశుద్ధితో కట్టినట్లయితే భయమెందుకని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. హౌస్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిసారీ అధికార పార్టీకి ఇది ఒక అలవాటుగా మారింది.  ప్రజాస్వామ్యంలో నిరసనలు చెప్పే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత ప్రతిపక్షాలుగా మాపై ఉంది. కానీ కెసిఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మమ్ముల్ని నిర్బందించినంత మాత్రాన మా పోరాటం ఆగదు. తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. అరెస్టులు కొత్తకాదు. మీ తీరు మార్చుకోకపోతే మిమ్ముల్ని ప్రజలు మార్చడం ఖాయం. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న మీకు ప్రజలే తగిన బుద్ది చెప్తారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజలే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిజమైన లబ్దిదారులకు చేరలేదని, ఈ ఇళ్లు కూడా నాసిరకంగా ఉన్నాయని, కొన్ని చోట్ల కూలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.