నోటీసులపై ఈటల రియాక్షన్..
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పంపిన నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. నోటీసులకు భయపడేది లేదని, కేసీఆర్ తో వివాదం పెట్టుకోవాలంటే జంకే రోజుల్లోనే ఆరునెలలపాటు ఆయనతో తాను ఎలా పోరాటం చేశానో తెలంగాణ సమాజం చూసిందన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేదని వస్తే పార్టీ అనుమతి తీసుకుని స్పందిస్తానన్నారు. తనతోపాటు మంత్రులుగా పని చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఇంజినీర్లే తాము ముఖ్యమంత్రి చెప్పినట్లు కట్టామని చెబుతుంటే ఇక మా నిర్ణయాలపై ఏం చెప్తామన్నారు. కమిషన్ గడువు ఎందుకు ఇన్ని సార్లు పొడిగించారో చెప్పాలని, ప్రజల ప్రయోజనార్థమా లేక బ్లాక్ మెయిల్ కోసమా? అని ఈటల ప్రశ్నించారు.