బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్‌పై స్పందించిన ఈటల
తెలంగాణా బీజేపీలో అంతర్గత వివాదాలు దుమారం రేపుతున్నాయి.కాగా నిన్న బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు.దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. అయితే ఓ దున్నపోతు తోకను మెలిపెడుతూ దాన్ని తన్ని వాహనంలోకి ఎక్కించిన వీడియోను పోస్ట్ చేస్తూ..బీజేపీలో కొంతమందికి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమని జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త తెలంగాణా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కాగా దీనిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ట్వీట్‌కు అర్థమేంటో జితేందర్ రెడ్డినే అడగాలన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఈటల సూచించారు. ఏది పడితే అది చేయడం మంచిది కాదన్నారు. పార్టీలో ఎవరి గౌరవానికీ భంగం కలిగించేలా వ్యవహరించొద్దన్నారు. అంతేకాకుండా ఎవరి స్వేచ్ఛ,గౌరవాన్ని తగ్గించకూడదని ఈటల స్పష్టం చేశారు.

