ఎంపీపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను బీఆర్‌ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్‌కు ఎక్కువ ప్రాధ్యాన్యత ఉండేదని పేర్కొన్నారు. తాను స్వయంగా ఆ పరిస్థితిని చూశానని, అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రి కన్నా అసదుద్దీన్ చెప్పిన పనులే త్వరగా అయ్యేవని, ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉండేవారని పేర్కొన్నారు.

